- 'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది'
సున్నా వడ్డీ రాయితీ నిధులు విడుదల కార్యక్రమాన్ని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. రబీలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకుని ఏడాదిలోగా చెల్లించిన రైతులకు నిధులు విడుదల కానున్నాయి. వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం రూ.128.47 కోట్లు జమ చేస్తారు. ఇ-పంటలో నమోదు చేసుకున్న రైతులకే పథకం వర్తిస్తుంది. పథకం ద్వారా 6,27,906 మంది రైతులు లబ్ధిపొందుతారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ
తెలంగాణలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బ్రిస్బేన్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు.. ఆస్ట్రేలియాలోని అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుక చేశారు. శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫన్ బకెట్ ఫేం భార్గవ్.. ఫోక్సో చట్టం కింద అరెస్ట్
యూట్యూబ్‌లో ప్రసారమయ్యే ఫన్ బకెట్ ఛానెల్‌తో పేరు సంపాదించి.. టిక్‌టాక్‌తో ఫేమస్ అయిన భార్గవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాలికకు అవకాశాలు కల్పిస్తామని లొంగదీసుకుని గర్భవతిని చేయటంతో.. ఫోక్సో చట్టం కింద భార్గవ్‌ని అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఈసీ సుశీల్ చంద్రకు కరోనా
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(ఈసీ) సుశీల్ చంద్రకు కరోనా సోకింది. ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు కూడా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద శర్మ.. వైరస్ బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవ్వొత్తులా వెలుగునిచ్చే 'పాండవ చెట్టు'