- డబ్బు, మద్యం పంపిణీపై నిఘా పెంచిన ఎస్‌ఈసీ
ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల అధికారులతో ఎస్‌ఈసీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ప్రవర్తన నియమావళి ఉల్లంఘన ధనం, మద్యం ప్రభావంపై విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై ఆదివారం ఉదయం.. అధికారులతో చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వీళ్లు పగటి వేషగాళ్లు.. జనం ముందు బుకాయిస్తున్నారు: చంద్రబాబు
విశాఖలోని గాజువాక కూడలిలో తెదేపా అధినేత చంద్రబాబు.. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మేయర్ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు ఆయన వెంట ప్రచారంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉదయం ప్రతిపక్షంలో.. సాయంత్రానికి అధికార పార్టీలో..!
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఈ మహిళా నాయకురాలి రాజకీయం.. విస్మయానికి గురి చేసింది. తెదేపా నాయకురాలిగా ఉన్న ఆమె.. ఉదయం ఆ పార్టీ నేతలతో ఆందోళన చేశారు. సాయంత్రానికే పార్టీ మారారు. అధికార పార్టీ గూటికి వెళ్లారు. వైకాపా కండువా వేసుకుంటూ ఫొటోలకు పోజులిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఛత్తీస్‌గఢ్ బాలుడి కేసులో పురోగతి... నిందితుడి రూపు గుర్తింపు
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి తప్పిపోయిన ఛత్తీస్‌గఢ్ బాలుడి కేసులో పురోగతి లభించింది. తిరుపతి అర్బన్ పోలీసులు సీసీటీవీలోని దృశ్యాలు చూసి నిందితుడిని గుర్తించారు. బాలుడు లేదా నిందితుడి ఆచూకీ తెలిస్తే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ 8099999977కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కుండ్లీ ఎక్స్ప్రెస్వే'ను దిగ్బంధించిన రైతులు
సోనీపత్లోని కుండ్లీ ఎక్స్ప్రెస్ వేను దిగ్బంధించారు అన్నదాతలు. వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమం 100 రోజులకు చేరిన సందర్భంగా ఈ మేరకు రహదారులపై ఆందోళన చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాక్ చొరబాటుదారుడిని హతమార్చిన భారత సైన్యం