- రాష్ట్రవ్యాప్తంగా భాజపా నేతల గృహ నిర్బంధం
త్తూరు జిల్లాలో రెండో రోజూ భాజపా, తెదేపా నేతల గృహనిర్బంధం కొనసాగుతోంది. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా భాజపా నేతలు ఆందోళనకు సిద్ధమైన క్రమంలో బుధవారం పోలీసులు నేతలను గృహ నిర్బంధం చేశారు. సీఎం జగన్ తిరుమల పర్యటన ముగిసే వరకు వారి నిర్బంధం కొనసాగేలా కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాజధాని అంశంపై సీఎంకు లేఖ రాస్తా: కేంద్రమంత్రి అథవాలే
రాజధాని అంశంపై సీఎం జగన్ కు లేఖ రాయనున్నట్లు కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. అమరావతి మహిళా ఐకాస నేతలు మంత్రిని కలిసి అమరావతి అంశం వివరించారు. రాజధానిగా అమరావతికి తన మద్దతు ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చర్చిలో విగ్రహాలు ధ్వంసం.. పోలీసుల దర్యాప్తు
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఇటీవల జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అభయాంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద హుండీ పగులగొట్టిన ఘటన మరువక ముందే.. ఆర్సీఎం చర్చి వద్ద విగ్రహాలను దుండగులను ధ్వంసం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వివేకా హత్య కేసు: చెప్పుల దుకాణం యజమానిని విచారిస్తున్న సీబీఐ
వివేకా హత్య కేసులో 13వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల చెప్పుల దుకాణం యజమాని మున్నాను కడప జైలు అతిథి గృహంలో విచారిస్తున్నారు. మరో ఐదుగురిని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విజయవంతంగా పృథ్వీ-2 పరీక్ష
అణ్వాయుధాలను మోసుకెళ్లే సత్తా ఉన్న పృథ్వీ-2 క్షిపణి పరీక్షలను సైన్యం నిర్వహించింది. రాత్రి వేళ ఈ క్షిపణి ప్రయోగం నిర్వహించినట్లు డీఆర్డీఓ తెలిపింది. చీకట్లో క్షిపణి తీరును పర్యవేక్షించినట్లు వెల్లడించింది. ఈ ప్రయోజం విజయవంతంగా ముగిసినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్త బిల్లులతో రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు