తెలంగాణకు చెందిన మాజీమంత్రి ఈటల రాజేందర్ 'ప్రజా దీవెన' యాత్రలో అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి నుంచి కొనసాగిన పాదయాత్ర.. వీణవంక మండలంలోకి ప్రవేశించింది. పోతిరెడ్డిపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో యాత్ర ముగించుకొని కొండపాక గ్రామానికి చేరుకున్నారు.
ETELA: ఈటల పాదయాత్రకు బ్రేక్... హైదరాబాద్ తరలింపు
ప్రజాదీవెన యాత్రలో తెలంగాణకు చెందిన మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ అస్వస్థతకు గురయ్యారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా వీణవంక మండలంలో పర్యటిస్తున్న ఈటల.. యాత్ర మధ్యలో అస్వస్థత చెందారు. ప్రత్యేక బస్సులో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ప్రజా దీవెన యాత్రలో ఈటలకు అస్వస్థత
యాత్ర మధ్యలో ఈటల అస్వస్థతకు గురి కావటంతో.. ప్రత్యేక బస్సులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, బొడిగ శోభ ఉన్నారు. వైద్య చికిత్సలను పర్యవేక్షిస్తున్నారు. సమాచారం అందుకున్న ఈటల సతీమణి.. హుటాహుటిన కొండపాక చేరుకున్నారు. కాగా యాత్ర ఇవ్వాళ్టితో 12వ రోజుకి చేరుకుంది. ఈనెల 19న ప్రజాదీవెన యాత్ర ప్రారంభం కాగా ఇప్పటివరకు 70 గ్రామాల్లో 222 కిలోమీటర్ల పాటు ఈటల యాత్ర సాగించారు..