ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 7, 2021, 7:53 PM IST

ETV Bharat / city

ETELA: 'తెరాస ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని ప్రజలు భావిస్తున్నారు'

తెలంగాణ రాష్ట్రంలో తెరాస సర్కారు గాడి తప్పిందని.. ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ (etela rajender)​ విమర్శించారు. ఈ ప్రభుత్వం ఎన్నికల కోసమే పనిచేస్తోందని... ప్రజల కోసం కాదని ఆరోపించారు.

etela rajender
ఈటల రాజేందర్

'తెరాస ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని ప్రజలు భావిస్తున్నారు

తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్​ (etela rajender)​ ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప... ఇష్టానికి లోబడి పని చేయొద్దని సూచించారు. హుజూరాబాద్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మండలానికో మంత్రి ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నిస్తున్నారన్నారు. ఎన్నికలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రలోభపెట్టడం తప్ప 57 ఏళ్లు నిండిన వాళ్లకు పింఛన్లు ఇచ్చారా అంటూ మంత్రులను ప్రశ్నించారు. ఇప్పటివరకు కొత్త రేషన్​ కార్డులు ఇచ్చారా అంటూ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఎన్నికల కోసమే పనిచేస్తోందని... ప్రజల కోసం కాదని విమర్శించారు.

సర్పంచ్​లు, కార్యకర్తలను భయపెట్టి, ప్రలోభపెట్టి తెరాసలో చేర్చుకుంటున్నారని ఈటల ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండదన్నారు. ఇప్పటికే తెరాస ప్రభుత్వం గాడితప్పిందని విమర్శించారు. హుజూరాబాద్​లో గెలిచేది భాజపాయేనని... ఎగిరేది కాషాయ జెండానేనని ఈటల రాజేందర్​ ధీమా వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో గోబెల్స్​ ప్రచారాన్ని తిప్పికొట్టి ధర్మాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు, కార్యకర్తలకు సూచించారు. రేపటి ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు తెలిపారు. కమలం గుర్తుకు ఓటేసి తనను ప్రజలకు ఈటల రాజేందర్​ విజ్ఞప్తి చేశారు.

కాషాయజెండా ఎగురుతుంది..

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప... ఇష్టానికి పనిచేయొద్దు. హుజూరాబాద్​లోనే కాదు రాష్ట్రంలోని ప్రజలందరూ తెరాస ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని భావిస్తున్నరు. హుజూరాబాద్‌లో కాషాయ జెండా ఎగురుతుంది. సామాజిక మాధ్యమాల్లో గోబెల్స్​ ప్రచారాన్ని తిప్పికొట్టి ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడాలి. -ఈటల రాజేందర్​, మాజీ మంత్రి, భాజపా నేత

ఇదీ చదవండి:

AP BJP: భాజపా సభ్యత్వానికి కంభంపాటి రాజీనామా

ABOUT THE AUTHOR

...view details