ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈఎస్ఐ కేసు: మాజీ మంత్రి వ్యక్తిగత కార్యదర్శిని ప్రశ్నించిన ఈడీ - esi scam in ap updates

ఈఎస్​ఐ మందుల కుంభకోణం కేసులో విజిలెన్స్​ నివేదికలు, అనిశా దర్యాప్తు ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ... తెలంగాణ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ముకుంద్ రెడ్డిని ప్రశ్నించింది.

enforcement-directorate
enforcement-directorate

By

Published : Nov 4, 2020, 6:18 PM IST

ఈఎస్ఐ మందుల కుంభకోణంలో తెలంగాణ కార్మిక శాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ముకుంద్ రెడ్డిని ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఈఎస్ఐ మందులు, బీమా సేవల రూపంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే తేల్చింది. డొల్ల కంపెనీలు, బోగస్ బిల్లులతో వేల కోట్ల రూపాయలు కాజేసినట్లు అనిశా అభియోగం.

ఈ కేసులో ఈఎస్ఐ మాజీ సంచాలకురాలు దేవికారాణి సహా పలువురిని అనిశా అధికారులు అరెస్టు చేశారు. విజిలెన్స్​ నివేదికలు, అనిశా దర్యాప్తు ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ ఇవాళ ముకుంద్ రెడ్డిని విచారిస్తోంది. బిల్లుల మంజూరు, బడ్జెట్ కేటాయింపుల వ్యవహారంలో మంత్రి కార్యాలయం, ఇతర అంశాలపై ఈడీ విచారణ జరుపుతోంది.

ఇవీ చూడండి:
!

ABOUT THE AUTHOR

...view details