ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 17, 2022, 9:25 AM IST

ETV Bharat / city

విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా

Electricity employees Relay: విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రభుత్వంతో చర్చలు సానుకూలంగా ఉన్నందున... ఇవాళ్టి నుంచి జరగాల్సిన రిలే నిరాహార దీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస నేతలు వెల్లడించారు.

Electricity employees Relay
Electricity employees Relay

Electricity employees Relay: విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రభుత్వంతో చర్చలు సానుకూలంగా ఉన్నందున.. ఇవాళ్టి నుంచి జరగాల్సిన రిలే నిరాహార దీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస వెల్లడించారు.

ఐకాస నేతలతో మంత్రి బాలినేని చర్చలు

విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఐకాస నేతలతో బుధవారం రోజు చర్చలు జరిపారు. గతనెల 28న.. 24 డిమాండ్లతో ఇచ్చిన నోటీసుపై మాట్లాడారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్‌ కేంద్రం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామంటూ.. ఉద్యోగులు నోటీసుల్లో పేర్కొన్నారు.

విద్యుత్ ఉద్యోగుల వేతనాలపై ఏర్పాటుచేసిన పీఆర్సీ.. ఆమోదయోగ్యం కాదన్నారు. పీఆర్సీ బాధ్యతను విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందిని క్రమబద్ధీకరించాలని.. ఉద్యోగులు, కుటుంబాలకు అపరిమిత వైద్యసౌకర్యం సహా.. విద్యుత్ సంస్థలో కారుణ్య నియామకాలు చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ.. ఉద్యోగ సంఘాల నేతలతో బాలినేని చర్చలు జరిపారు. ఈ చర్చలు సానుకూలంగా ఉన్నందున ఇవాళ్టి నుంచి జరగాల్సిన రిలే నిరాహార దీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యుత్‌ ఉద్యోగుల నేతలు తెలిపారు.

ఇదీ చదవండి:power employees jac: ప్రభుత్వం పట్టించుకోకపోతే సమ్మెకు దిగుతాం: విద్యుత్ ఉద్యోగుల ఐకాసా

ABOUT THE AUTHOR

...view details