కరోనా నేపథ్యంలో స్పాట్ బిల్లింగ్ను నిలిపివేస్తూ విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గత మూడు నెలల సగటు విద్యుత్తు వినియోగాన్ని మార్చి నెల విద్యుత్తు బిల్లుగా పరిగణించాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఈ మొత్తాన్ని వెబ్సైట్లో ఉంచుతుంది. ఆన్లైన్ ద్వారా బిల్లు మొత్తాన్ని చెల్లించాలని వినియోగదారులకు సూచించింది. విద్యుత్ వాస్తవ వినియోగం ప్రకారం బిల్లు మొత్తంలో హెచ్చుతగ్గులు ఉంటే తర్వాతి నెలలో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. మీటర్ రీడింగ్ ఆధారంగా విద్యుత్ వినియోగ ఛార్జీలను సిబ్బంది ప్రతి నెలా ఇంటింటికీ వచ్చి అందిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా స్పాట్ బిల్లింగ్ నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు జేఎండీ చక్రధరబాబు తెలిపారు.
విద్యుత్ స్పాట్ బిల్లింగ్ నిలిపివేత
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా స్పాట్ బిల్లింగ్ను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక బిల్లు మొత్తం ఆన్లైన్లో చెల్లించాలని తెలిపాయి. వాస్తవ వినియోగంలో హెచ్చుతగ్గులను తర్వాతి నెలలో సర్దుబాటు చేయాలని నిర్ణయించాయి.
విద్యుత్ బిల్లులు ఆన్లైన్లో చెల్లించాలి