విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్.. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయా? లేదా? అని మాత్రమే చూడాలని కేంద్ర విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. పలు సంస్థలు ఏపీ డిస్కంలతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు షరతులతో కూడిన అనుమతినిస్తూ ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ గతేడాది అక్టోబరు 5న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ కుదుర్చుకున్న పీపీఏ.. కేంద్రం జారీ చేసిన పీపీఏ ప్రకారం ఉంటే విద్యుత్ చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం దానికి రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం అవసరం లేదని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. సంస్థలతో ఒప్పందాల ప్రకారం టారిఫ్‌ను నిర్ధారించే సమయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించడం విద్యుత్ చట్టంలోని సెక్షన్ 63 స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని పేర్కొంది. ఒప్పందాలు చేసుకున్న విద్యుత్ సంస్థలకు ఎలాంటి షరతులు లేకుండానే యూనిట్‌కు రూ.2.72తోపాటు, ట్రేడ్ మార్జిన్ కింద 7 పైసలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
'ఆ విద్యుత్ ఒప్పందాల్లో జోక్యం తగదు' - విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ న్యూస్
విద్యుత్ చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం కుదుర్చుకున్న కొనుగోలు ఒప్పందాల్లో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వేలు పెట్టడానికి వీల్లేదని కేంద్ర విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఆ ఒప్పందాలు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉన్నాయా? లేదా? అని చూడాలి తప్పితే వీటిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించే అధికారం కమిషన్‌కు ఉండబోదని పేర్కొంది. ఈ టారిఫ్‌ల ఆమోదానికి షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.
Electricity Appellate Tribunal about andhrapradesh