ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోటాపోటీగా పరిషత్‌ ఎన్నికల ప్రచారం.. పలుచోట్లలో బరిలో తెదేపా అభ్యర్థులు - జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం వార్తలు

రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. వైకాపా ప్రచారంలో జోరు కనబరుస్తుండగా.. పలుచోట్ల తెలుగుదేశం అభ్యర్థులు సైతం సై అంటున్నారు. ఈనెల 8న జరగనున్న పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.

elections
ఎన్నికల ప్రచారం

By

Published : Apr 6, 2021, 9:32 AM IST

జోరుగా ఎన్నికల ప్రచారం

రాష్ట్రంలో వరుస ఎన్నికలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్థానిక ఎన్నికలు ముగియగానే.. పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో పార్టీలు మళ్లీ ప్రచారంలో పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలో తెలుగుదేశం అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కాంగ్రెస్ ZPTC అభ్యర్థిని జమ్ము రాజేశ్వరి ఓట్లు అభ్యర్తించారు. జొన్నవలసలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వైకాపా అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వైకాపా అభ్యర్థులను గెలిపించాలని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ కోరారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల తరపున గ్రామాల్లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

పోలీంగ్ కేంద్రాలకు సామాగ్రి తరలింపు

ఈనెల 8న జరగనున్న పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గుంటూరు జిల్లాలో అన్ని మండల కేంద్రాలకు అధికారులు పోలింగ్ సామాగ్రి తరలించారు. పీవో, ఏపీవో లకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎన్నికల సిబ్బందికి అధికారులు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని కడప కలెక్టర్‌... సిబ్బందిని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
మద్యం దుకాణాలు మూసివేత

పరిషత్‌ ఎన్నికల సందర్భంగా ఈ నెల 8న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సంస్థలకు సెలవు ప్రకటించాలి కలెక్టర్‌లకు ఆదేశించింది. ఎన్నికలు జరిగే చోట్ల 48 గంటల ముందే మద్యం దుకాణాలు మూసివేయాలని సూచించింది.

చిటికెన వేలుకు ఓటు సిరా గుర్తు

పరిషత్‌ ఎన్నికల్లో ఎడమ చేతి చిటికెన వేలుకు ఓటు సిరా గుర్తు వేయాలని ఎస్​ఈసీ స్పష్టం చేసింది. ఇటీవల స్థానిక ఎన్నికల్లో చూపుడు వేలుకు వేసిన సిరా ఇంకా చెరిగిపోనందున చిటికెన వేలుకు సిరా గుర్తు వేయాలని ఆదేశించింది.

ఇదీ చదవండి:

తిరుపతిలో వాడీవేడిగా పార్టీల ప్రచారాస్త్రాలు

ABOUT THE AUTHOR

...view details