ఈకేవైసీ నమోదు కేంద్రాలను పెంచాలి: చంద్రబాబు - ఈకేవైసీ నమోదు కేంద్రాలను పెంచాలి: చంద్రబాబు
ఈకేవైసీ కష్టాలపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. నమోదు చేసుకోకపోతే పథకాలు తొలగిస్తామనే భయాన్ని సృష్టించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నమోదు కేంద్రాల్లో సాంకేతికతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. వెంటనే నమోదు కేంద్రాలను పెంచాలని ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో ఈకేవైసీ కష్టాలపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని అమలుచేసే ముందు దానిపై ప్రజలకు అవగహన కల్పించాలని అన్నారు. సాంకేతిక వినియోగంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. అలాంటివేమీ లేకుండా ఈకేవైసీ చేయించుకోపోతే పథకాలకు అర్హత ఉండదనే భయాన్ని ప్రభుత్వం కల్పించటాన్ని తప్పుబట్టారు. కేంద్రాల వద్ద మహిళలు, పిల్లలు పడిగాపులు పడాల్సి వస్తోంది..పేదోళ్లకు ఎందుకీ కష్టాలంటూ ట్వీట్ చేశారు. లబ్ధిదారులను తొలగించాలనే లక్ష్యంతోనే ఇలాంటి నిబంధనలు తెచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే నమోదు కేంద్రాలను పెంచాలని డిమాండ్ చేశారు.