ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యథాతథంగా అమ్మఒడి పథకం అమలు: మంత్రి సురేశ్

అమ్మఒడి పథకం యథాతథంగా అమలు చేస్తామని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు. ఈనెల 11న తల్లుల ఖాతాలో డబ్బులు జమవుతాయన్నారు.

education minister adimulapu suresh
education minister adimulapu suresh

By

Published : Jan 9, 2021, 10:29 PM IST

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నా అమ్మఒడి పథకం యథాతథంగా అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ పథకం కింద రూ.6,161 కోట్లను జమ చేస్తామని చెప్పారు. ఈ నెల 11న సీఎం జగన్‌ ప్రారంభిస్తారని వెల్లడించారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి తెలిపారు.

ఏకపక్ష నిర్ణయం...

మరోవైపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ తీరును మంత్రి సురేశ్ తప్పుబట్టారు. న్యాయవ్యవస్థ ఇస్తున్న సూచనలు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పాటించరా..? అని నిలదీశారు. షెడ్యూల్ విడుదల చేయడం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని ఆరోపించారు.

ఇదీ చదవండి

దారుణం: వరుసకు సోదరైన యువతిపై కామాంధుడు లైంగికదాడి

ABOUT THE AUTHOR

...view details