ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tollywood Drugs Case: 'ఎఫ్‌ క్లబ్‌లో జరిగే పార్టీలకు హాజరయ్యారా?' - ఈడీ వార్తలు

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా బుధవారం సినీనటీ ముమైత్​ఖాన్​ను ఈడీ అధికారులు 6 గంటలపాటు ప్రశ్నించారు.

Tollywood Drugs Case
ముగిసిన ముమైత్ విచారణ

By

Published : Sep 15, 2021, 6:43 PM IST

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. సినీనటీ ముమైత్​ఖాన్​ను ఈడీ అధికారులు 6 గంటలపాటు ప్రశ్నించారు. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందులో అనుమానాస్పదంగా కనిపించిన లావాదేవీల గురించి ప్రశ్నించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ముమైత్ సమాధానమిచ్చారు. ఈడీ అధికారులు ఇప్పటికే సినీ రంగానికి చెందిన 9 మందిని ప్రశ్నించారు. మత్తుమందు సరఫరాదారులైన కెల్విన్, వాహిధ్​లను కూడా ఇదివరకే విచారించారు.

ఎఫ్‌క్లబ్‌లో జరిగే పార్టీలకు హాజరయ్యారా? మీరు ఎప్పుడైనా మాదకద్రవ్యాలు వినియోగించారా? మాదకద్రవ్యాలు వినియోగించే సెలబ్రిటీలతో మీకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే అంశాలపై క్షుణ్ణంగా విచారించారు. దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మీతో కలిసి ముమైత్ ఖాన్ పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వారిద్దరిని ఈడీ అధికారులు విచారించారు.

ఇదీ చదవండి:NREGA: విజిలెన్స్ విచారణతో కాలయాపన చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details