ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 9, 2020, 3:22 PM IST

ETV Bharat / city

ఆరోగ్యం: ఆహారంతో అందం ఇక మీ సొంతం

చర్మం ఆరోగ్యాన్నీ, అందాన్నీ ప్రభావితం చేసేది మనం తీసుకునే ఆహారమే! చర్మానికి పోషణనిచ్చి, ఆరోగ్యంతో పాటు నిగారింపును అందించే ఆహారపదార్థాలేంటో తెలుసుకుందాం.

eenadu
eenadu

అందమైన, ఆరోగ్యమైన చర్మాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం ఎవరు చేసే ప్రయత్నాలు వారు చేస్తుంటారు. అందుకోసం విభిన్నమైన లేపానలు, మెరుపులు అద్దుతుంటారు. కానీ అలా కాకుండా ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

ఖర్జూరా:ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-ఎ ఉండే ఖర్జూరాలు చర్మాన్ని సహజంగా కాంతిమంతంగా చేయడంతో పాటు ఆరోగ్యాన్నీ ఇస్తాయి. వీటిలోని విటమిన్‌-సి చర్మానికి సాగే గుణాన్ని అందించి చర్మం వదలుగా కాకుండా అడ్డుకుంటుంది. అలాగే దీనిలోని యాంటీ ఏజింగ్‌ సమ్మేళనాలు వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవు. ముఖంపై గీతలు, ముడతలు రాకుండా ఉండాలంటే రోజూ ఖర్జూరాలను తీసుకోండి మరి.

బాదం:విటమిన్‌-ఇ నిండుగా ఉండే బాదం సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. వీటిని రోజూ తీసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. డ్రైస్కిన్‌ ఉన్నవారు బాదంపేస్ట్‌ను ముఖానికి పూతలా వేసుకుంటే చర్మానికి కావాల్సిన తేమ, పోషణ అంది ముఖం తాజాగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు చర్మానికి బాదం నూనె రాసుకుని మృదువుగా మర్దనా చేస్తే చర్మం మెరుస్తుంది.

గ్రీన్ టీ:దీనికి ఆరోగ్యంతో పాటు అందాన్ని సంరక్షించే సుగుణాలున్నాయి. యాంటీఆక్సిడెంట్లున్న గ్రీన్ టీ తరచూ తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి మచ్చలను తగ్గించి చర్మాన్ని మెరిపిస్తుంది.

అరటిపండు:ఈ పండులో మీ చర్మానికి కావాల్సిన అత్యవసర పోషకాలు మెండుగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, మాంగనీస్, ప్రీమెచ్యూర్ ఏంజింగ్‌ను అడ్డుకోవడమే కాకుండా మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. ఇది తగిన పోషణనిచ్చిన చర్మం పొడిబారకుండా చూస్తుంది.

ఇదీ చదవండి

కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 10కి చేరిన మృతుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details