ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సచివాలయంలో డ్రోన్ల నమూనాల ప్రదర్శన

సచివాలయంలో డ్రోన్ల నమూనాలను ఓ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు ప్రదర్శించారు. ఓర్వకల్లు ఎయిర్‌స్ట్రిప్‌ నుంచి వంద కిలోమీటర్ల దూరం వరకూ డ్రోన్ల ప్రయోగానికి కేంద్రం తమకు అనుమతి మంజూరు చేసిందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ప్రయోగానికి అనుమతివ్వాల్సిందిగా అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

By

Published : Aug 7, 2019, 5:06 AM IST

సచివాలయంలో డ్రోన్ల నమూనాల ప్రదర్శన

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ల ప్రయోగానికి అనుమతివ్వాల్సిందిగా అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ఓర్వకల్లు ఎయిర్‌స్ట్రిప్‌ నుంచి వంద కిలోమీటర్ల దూరం వరకూ డ్రోన్ల ప్రయోగానికి కేంద్రం తమకు అనుమతి మంజూరు చేసిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అక్కడ వినియోగించే డ్రోన్ల నమూనాలను సచివాలయంలో ప్రదర్శించారు. ఈ తరహా డ్రోన్లను ఆఫ్రికా సహా వివిధ దేశాల్లో ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నామని... రాష్ట్రంలోనూ దీనికి సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరినట్లు నిర్వాహకులు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఔషధాలు, ఆహార పదార్ధాలు, రక్త సరఫరాకు ఈ డ్రోన్లు ఉపయుక్తంగా ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు.

సచివాలయంలో డ్రోన్ల నమూనాల ప్రదర్శన
ఇవీ చూడండి-'సీఎంకు వరద ప్రాంతాల్లో పర్యటించే సమయం లేదా?'

ABOUT THE AUTHOR

...view details