ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

DRDA SCHEME CANCELLED: ఏప్రిల్‌ నుంచి డీఆర్‌డీఏ పథకం రద్దు - ఏపీ లేటెస్ట్ న్యూస్

డీఆర్‌డీఏ పథకాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి లేఖ రాశారు.

drda-scheme-canceled-from-april
ఏప్రిల్‌ నుంచి డీఆర్‌డీఏ పథకం రద్దు

By

Published : Nov 6, 2021, 9:07 AM IST

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) పథకాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ లేఖ రాశారు. డీఆర్‌డీఏను జిల్లా పరిషత్తు లేదా జిల్లా పంచాయతీల్లో విలీనం చేయాలని సూచించారు. జిల్లా పరిషత్తులు లేని ఈశాన్య రాష్ట్రాల్లో జిల్లా కౌన్సిల్‌, ఇతర సంస్థల్లో విలీనం చేయాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.

డీఆర్‌డీఏలో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న సిబ్బందిని మాతృశాఖకు పంపించాలని, మిగతా సిబ్బందిని జిల్లా ప్రణాళిక, పర్యవేక్షణ విభాగం లేదా ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంలో సర్దుబాటు చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details