ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రవాస 'పాఠశాల'కు 2 లక్షల డాలర్ల విరాళం - ఎన్నారై కుటుంబాలు

ప్రవాస బాలబాలికలకు తెలుగు నేర్పించడం కోసం తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన తాళ్లూరి జయశేఖర్‌ 2లక్షల డాలర్ల విరాళం ప్రకటించారు. ఎన్నారై కుటుంబాల తెలుగు విద్యార్థులకు మేలు చేయాలనేదే తన లక్ష్యమని పేర్కొన్నారు.

తాళ్లూరి జయశేఖర్‌
తాళ్లూరి జయశేఖర్‌

By

Published : Jul 14, 2021, 7:40 AM IST

ప్రవాస బాలబాలికలకు తెలుగు నేర్పించే 'పాఠశాల' కార్యక్రమానికి 2 లక్షల డాలర్లు విరాళం ఇస్తున్నట్లు తాళ్లూరి జయశేఖర్‌ ప్రకటించారు. తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన ఆయన.. తన కుటుంబ సభ్యుల తరఫున ఈ విరాళం అందిస్తున్నామని తెలిపారు.

ఎన్నారై కుటుంబాల తెలుగు విద్యార్థులకు మేలు చేయాలనేదే తన లక్ష్యమని పేర్కొన్నారు. అమెరికాలో తెలుగు భాషా వికాసానికి 'పాఠశాల' వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు వివిధ ఉత్సవాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులు, కవులు, రచయితలను ఒకే వేదిక మీదకు తెచ్చి 'తానా ప్రపంచ సాహిత్య వేదిక' నిర్మించామని జయశేఖర్‌ వివరించారు. 23 దేశాల్లోని 21 సంస్థల భాగస్వామ్యంతో ప్రపంచ కవి మహా సమ్మేళనం-21 నిర్వహించామని పేర్కొన్నారు. ప్రవాసుల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకుని ఈ దఫా మహాసభలు నిర్వహించడం లేదని తెలిపారు.

ఇదీ చదవండి:తానా ఔధార్యం: కరోనా బాధితులకు 25 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు అందజేత

ABOUT THE AUTHOR

...view details