సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్ల ప్రవేశాన్ని నిషేధిస్తూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్ల సహా అనధికార వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేధిస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ ఉత్తర్వులు ఇచ్చారు. అనధికార వ్యక్తుల ప్రమేయం వల్లే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందని ఏసీబీ నివేదిక ఇచ్చింది. తాము సీజ్ చేసిన లెక్కల్లోకి రాని నగదు.. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్ల ద్వారానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరిందని ఎసీబీ స్పష్టం చేసింది. అనధికారిక వ్యక్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వస్తే చర్యలు తప్పవని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ అంతర్గత ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మరోవైపు మొత్తం డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థనే అవినీతి వ్యవస్థగా చిత్రీకరించొద్దని డాక్యుమెంట్ రైటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్ల ప్రవేశం రద్దు..! - DOCUMENT WRITER
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్ల ప్రవేశాన్ని నిషేధిస్తూ... స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. వారు కార్యాలయంలోకి రావడం వల్లే అవినీతి జరుగుతోందని ఏసీబీ నివేదిక ఇచ్చింది.
కార్యాలయాల్లోకికి డాక్యుమెంట్ రైటర్ల ప్రవేశం రద్దు..!