ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైద్యం చేస్తున్నారా.. జాగ్రత్తలు తీసుకోండి

సాధారణ వైద్యసేవలందించే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ సేవల నిర్వహణపై మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసింది. వైద్య సేవలందిస్తున్నప్పుడు తప్పనిసరిగా కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

doctors preatios while treating patients
చికిత్స చేసేప్పుడు వైద్యులు తీసుకోవలసిన జాగ్రత్తులు

By

Published : May 4, 2020, 11:53 AM IST

కరోనా కారణంగా గత రెండు నెలలుగా సాధారణ వైద్యసేవలకు ఆటంకాలు ఏర్పడడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులకు ఊరట కలగనుంది. సాధారణ వైద్యసేవలందించే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ సేవల నిర్వహణపై మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసింది. సాధారణ వైద్యసేవలందిస్తున్నా మాస్కులు, భౌతిక దూరం, వ్యక్తిగత పరిరక్షణ కిట్ల వంటి రక్షణ చర్యలను ఆసుపత్రుల్లో పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఓపీ, ఐపీ సేవల్లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ.. సిబ్బంది పనిచేసే ప్రదేశాలను స్వల్ప(మైల్డ్‌).. కొంచెం ప్రమాదం(మోడరేట్‌).. ఎక్కువ ప్రమాదం(హైరిస్కు) విభాగాలుగా విభజించి.. వారెలాంటి వ్యక్తిగత పరిరక్షణ కిట్లను హేతుబద్ధంగా ఎలా వాడాలనేది మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఓపీ సేవలు, ముందస్తు ఎంపిక ద్వారా చేసే శస్త్రచికిత్సలు నిలిచిపోవడంతో.. తిరిగి వాటిని పునరుద్ధరించే దిశగా వైద్యఆరోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది.

ఔట్‌ పేషెంట్‌ విభాగంలో..

  • హెల్ప్‌డెస్క్‌, రిజిస్ట్రేషన్‌ కౌంటర్లలో సేవలందించేవారు, డాక్టర్ల ఛాంబర్లలో ఉండేవారు, ఫార్మసీ కౌంటర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, ఇన్‌ పేషెంట్‌ విభాగంలో వార్డులు, వ్యక్తిగత గదుల్లో తనిఖీలు చేసే సిబ్బంది, ఎమర్జెన్సీ విభాగంలో కేసులను పరీక్షించే డాక్టర్లు.. వీరు ట్రిపుల్‌ లేయర్‌ మెడికల్‌ మాస్కు, లేటెక్స్‌ ఎగ్జామినేషన్‌ గ్లోవ్స్‌ వాడాలి.
  • డెంటల్‌, ఈఎన్‌టీ, కంటి డాక్టర్ల ఛాంబర్లు, ప్రీఅనిస్థిటిక్‌ చెకప్‌ క్లినిక్‌ వారు ఎన్‌95 మాస్కులు, గాగుల్స్‌, లేటెక్స్‌ ఎగ్జామినేషన్‌ గ్లోవ్స్‌ వాడాలి.

ఇన్‌పేషెంట్‌ విభాగంలో..

  • ఐసీయూ, క్రిటికల్‌ కేర్‌, లేబర్‌ రూం, ఆపరేషన్‌ థియేటర్లలో సేవలందించేవారు ట్రిపుల్‌ లేయర్‌ మెడికల్‌ మాస్కులు/ఎన్‌95 మాస్కులు, ఫేస్‌షీల్డులు, స్టెరైల్‌/నైట్రైల్‌ గ్లోవ్స్‌ ఉపయోగించాలి.
  • ఐసీయూలు, క్రిటికల్‌ వార్డుల్లో శవాలను తీసేవారు, మార్చురీకి తరలించేవారు, అందరూ తాకే స్థలాలను శుభ్రం చేసేవారు, అంబులెన్స్‌ డ్రైవర్లు ట్రిపుల్‌ లేయర్‌ మాస్కులు, లేటెక్స్‌ ఎగ్జామినేషన్‌ గ్లోవ్స్‌ వాడాలి.
  • ఎమర్జెన్సీ వార్డుల్లో తీవ్ర అనారోగ్యమున్న రోగులను పరీక్షించేటప్పుడు (ఏరోసెల్‌ జెనరేటింగ్‌ ప్రొసీజర్‌ చేసే సమయంలో), తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న రోగులను పరీక్షించేటప్పుడు.. వీరు ఎన్‌95 మాస్కు, శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచే దుస్తులు, గాగుల్స్‌, నైట్రైల్‌ ఎగ్జామినేషన్‌ గ్లోవ్స్‌, బూట్లతో కూడిన పూర్తి స్థాయి పీపీఈ కిట్‌ను వాడాలి.

ఇవీ చూడండి: లాక్​డౌన్ ఎఫెక్ట్: నిండు గర్భిణి 115 కి.మీ. నడక

ABOUT THE AUTHOR

...view details