విశాఖ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న వైద్యుడు సుధాకర్‌ను నిర్బంధించడం అతని ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. పోలీసులు, సీబీఐ అరెస్టు చేయనప్పుడు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేందుకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది. సీబీఐ విచారణకు సహకరించాలని డాక్టరు సుధాకర్‌కు సూచిస్తూనే.. మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ సమ్మతితో స్వేచ్ఛగా బయటకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది.
డాక్టర్ సుధాకర్ తల్లి కావేరి లక్ష్మీబాయి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను స్వీకరించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హౌస్‌మోషన్‌లో విచారించింది. హైకోర్టు తీర్పు మేరకు ఈరోజు సాయంత్రానికి సుధాకర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని.. అతని తరపు న్యాయవాది జె. శ్రావణ్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు అనుమతించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను.. తాము ఉపసంహరించుకుంటామని చెబుతున్న శ్రవణ్ కుమార్‌తో ముఖాముఖి..!