రాష్ట్రంలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, వాటిలో చేపడుతున్న భద్రతా చర్యలపై కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ మంత్రి జయరాం సమీక్షించారు. పరిశ్రమల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరిగే కంటే ముందే రక్షణ చర్యలు చేపట్టడంలో కర్మాగారాల యజమానులకు, అక్కడ పని చేసే సిబ్బందికి అవగాహన కల్పించాలని ఆదేశించారు.
భవిష్యత్లో ఎటువంటి ఇబ్బందికర సంఘటనలు జరగకుండా క్షేత్రస్థాయిలో విధులను సమర్థవంతంగా నిర్వహించడమే కాక... సంబంధిత శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న కర్మాగారాలను గుర్తించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దిశలో... యజమానులు చర్యలు తీసుకోవాలన్నారు.