Cyber Crime Latest: అందమైన సాయంత్రాలు.. అవధులులేని ఆనందం ఆస్వాదించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? మాతో మాట్లాడండి.. అంటూ మీ చరవాణులకు, వాట్సాప్‌కు సంక్షిప్త సందేశాలు వస్తున్నాయా? నిజమేనననుకుని మాట్లాడితే మీ బ్యాంక్ ఖాతాల్లోంచి రూ.లక్షలు మాయమవడం ఖాయం. కోల్‌కతా కేంద్రంగా సైబర్ నేరస్థులు యువకులపై ప్రయోగించిన సమ్మోహనాస్త్రాలివి. చరవాణులకు వచ్చిన ఫోన్‌నంబర్లతో మాట్లాడిన కొందరు రూ.లక్షలు నగదు బదిలీ చేసి మోసమని తెలుసుకుని సైబర్ క్రైమ్‌పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
రూ.10 వేలు కడితే సభ్వత్యం:చరవాణులకు సంక్షిప్త సందేశాలు, వాట్సాప్ నంబర్‌కు చిత్రాలు పంపుతున్న సైబర్ నేరస్థులు బాధితులను మోసం చేసేందుకు భారీ నెట్‌వర్క్ నిర్వహిస్తున్నారు. రోజుకు వెయ్యిమందికి సందేశాలు పంపుతున్నారు. స్పందించిన వారితో ఫోన్‌లో మాట్లాడేందుకు అందమైన యువతులను టెలీకాలర్లుగా నియమించుకున్నారు. ఫోన్ చేసిన వారితో మత్తుగా మాట్లాడ్డం.. ఫలానా చోట ఉన్నాం.. భోజనం చేద్దామంటూ చెప్పించడం.. బాధితులు అంగీకరించగానే రూ.10వేలు సభ్యత్వరుసుం చెల్లించాలని షరతు విధిస్తున్నారు. చెల్లించగానే.. వీడియోకాల్ చేసి మాట్లాడుతున్నారు. రిసార్ట్‌కు వెళ్దాం.. నాకు నగదు బదిలీ చేస్తే.. తెలిసిన ప్రాంతానికి వెళ్దాం అంటున్నారు. నగదు బదిలీ చేయగానే.. మాట్లాడ్డం ఆపేస్తున్నారు..