బర్డ్‌ఫ్లూపై ఎలాంటి వదంతుల్ని నమ్మవద్దని పశు సంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. ‘ఈ వ్యాధి పక్షి నుంచి పక్షికి సోకుతుందిగానీ పక్షి నుంచి మనిషికి సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మన దేశంలో మనుషుల్లో ఎక్కడా బర్డ్‌ఫ్లూ సోకిన దాఖలాల్లేవు’ అని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించారు.
‘బర్డ్ ఫ్లూ వస్తుందనే అనుమానంతో ప్రజలు తినకపోవడంతో కోడిగుడ్లు, మాంసం ధరలు పడిపోతున్నాయి. బాగా ఉడికించిన కోడిగుడ్లు, మాంసం తినడంవల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ సోకదు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధ్రువీకరించింది’ అని పేర్కొన్నారు.