దిశ కేసు నిందితులకు మరోసారి శవపరీక్ష నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 23 సాయంత్రం 5 గంటల లోపు రీపోస్టుమార్టం నిర్వహించాలని తెలిపింది. మృతదేహాలకు దిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం నిర్వహించి... శవపరీక్షను చిత్రీకరించి తమకు అప్పగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శవపరీక్ష అనంతరం మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగించాలని గాంధీ సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.
'దిశ కేసు నిందితులకు మరోసారి శవపరీక్ష' - disha case
దిశ కేసు నిందితులకు రీపోస్ట్‌మార్టమ్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 23 సాయంత్రం 5 గంటల లోపు దిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం నిర్వహించి... శవపరీక్షను చిత్రీకరించి తమకు అప్పగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
మరోసారి శవపరీక్ష'
ఎన్‌కౌంటర్‌లో వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకొని... సీఎస్‌ఎస్‌ఎల్‌కు పంపాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్, కేసు డైరీ, వాహనాలు, ఆయుధాల రిజిస్టర్ వివరాలు తీసుకోవాలని సిట్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఆధారాలు స్వాధీనం చేసుకుని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిషన్‌కు అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది.