ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Black film fine: ప్రముఖ దర్శకుడికి జరిమానా.. కారు బ్లాక్​ ఫిల్మ్ తొలగింపు - బ్లాక్​ ఫిల్మ్ అద్దాలు

Black film fine: తెలంగాణలోని హైదరాబాద్​ పోలీసులు బ్లాక్​ ఫిల్మ్ అద్దాలు ఉపయోగించే కార్లపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇవాళ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కారుకు జరిమానా విధించారు. కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించారు.

బ్లాక్​ఫిల్మ్​ తొలగిస్తున్న పోలీసులు
బ్లాక్​ఫిల్మ్​ తొలగిస్తున్న పోలీసులు

By

Published : Apr 4, 2022, 6:14 PM IST

Black film fine: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కారు అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్​ను హైదరాబాద్​ పోలీసులు తొలగించారు. త్రివిక్రమ్ కారుకు జరిమానా విధించిన జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు అద్దాలు తొలగించి పంపించారు. ఆ సమయంలో త్రివిక్రమ్‌ కారులోనే ఉన్నారు. వాహనాలకు ఉన్న బ్లాక్‌ ఫిల్మ్‌లను తొలగించాలని కొన్నిరోజులుగా ట్రాఫిక్‌ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలా తొలగించని వారి వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. ఎంతటివారైనా నిబంధనలు అతిక్రమిస్తే వదిలేది లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మంచు మనోజ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌ కార్లకు ఉన్న బ్లాక్‌ ఫిల్మ్‌లను పోలీసులు తొలగించి ఫైన్‌ వేశారు.

గత నెల జూబ్లీహిల్స్​లో జరిగిన కారు ప్రమాదం అనంతరం పోలీసులు చర్యలు చేపట్టారు. నగరంలో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉన్న కార్లతో పాటు ప్రజాప్రతినిధుల స్టిక్కర్లున్న వ్యక్తిగత వాహనాలు గుర్తించి తొలిగిస్తున్నారు. సరైన నంబర్ ప్లేట్లు​లేని వాహనాలను వావాహాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. జూబ్లీహిల్స్​లో బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్​తో ఉన్న కారు పాదచారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన మహిళలకు తీవ్రగాయాలు కాగా.. శిశువు మరణిచింది.

ఇదీ చూడండి: నటుడు మంచు మనోజ్​కు పోలీసులు ఫైన్ వేశారు..!

ABOUT THE AUTHOR

...view details