ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వ్యాక్సినేషన్​తో ఎలాంటి సమస్యలు లేవు: ఆరోగ్యశాఖ డైరెక్టర్

విజయలక్ష్మి మృతికి కారణాలు తెలియాల్సి ఉందని ఆరోగ్యశాఖ డైరెక్టర్ గీతా ప్రసాదిని అన్నారు. శవ పరీక్ష నివేదిక వస్తేనే కారణాలు తెలుస్తాయని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సంతృప్తికరంగా జరుగుతోందన్నారు.

ఆరోగ్యశాఖ డైరెక్టర్ గీతా ప్రసాదిని
director of public health geeta prasadini

By

Published : Jan 24, 2021, 7:38 PM IST

గుంటూరులో వ్యాక్సినేషన్‌పై నిపుణుల కమిటీ సమావేశమైంది. ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ గీతా ప్రసాదిని ఆధ్వర్యంలో ఏఈఎఫ్ఐ కమిటీ భేటీ అయింది. కరోనా టీకా అనంతర ప్రతికూల ప్రభావాలపై సమీక్షించారు. ఆశా కార్యకర్త విజయలక్ష్మి మృతిపై చర్చించారు. వ్యాక్సినేషన్ సంతృప్తికరంగా జరుగుతోందని ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ గీతా ప్రసాదిని తెలిపారు. స్వల్ప అనారోగ్య లక్షణాలు తప్ప ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్‌కు ప్రజలు భయపడాల్సిన పని లేదన్నారు.

ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ గీతా ప్రసాదినితో ముఖాముఖి

విజయలక్ష్మి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. శవపరీక్ష నివేదిక వస్తేనే కారణాలు తెలుస్తాయి. కరోనా వ్యాక్సిన్‌కు ప్రజలు భయపడాల్సిన పనిలేదు. కొవాగ్జిన్, కొవిషిల్డ్ అత్యంత సురక్షితమైనవి. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నాం - గీతా ప్రసాదిని, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌

ABOUT THE AUTHOR

...view details