Digi Yatra at airports: విమానాశ్రయంలో టికెట్ లేదా బోర్డింగ్ పాస్, ధ్రువీకరణ పత్రాలు పట్టుకుని క్యూలో ఎక్కువ సమయం నిల్చునే అవసరం లేకుండా ఇకపై నేరుగా టెర్మినల్ వద్దకు చేరుకోవచ్చు. ఇందుకువీలుగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘డిజియాత్ర’ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ యాప్ సాయంతో ముఖ గుర్తింపు వ్యవస్థ (ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత) ఆధారంగా ప్రయాణికులు చెకిన్ అయ్యే వీలుంటుంది.
Digi Yatra App: కేంద్రం తీసుకొచ్చిన డిజియాత్ర సాంకేతిక వ్యవస్థను ఇప్పటికే దిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో ప్రారంభించారు. ఈ నెల 18 నుంచి హైదరాబాద్ విమానాశ్రయంలో ఈ సేవలు ఆరంభమం కానున్నాయి. ఈ సౌలభ్యాన్ని వినియోగించుకునేందుకు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లో డిజియాత్ర యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ఆధార్/డ్రైవింగ్ లైసెన్స్ నంబరును నమోదు చేయాలి. దీని ఆధారంగా డేటాబేస్ నుంచి ఆ యాప్ ఇ-కేవైసీ వివరాలు తీసుకుంటుంది. దీని ఆధారంగా ముఖ గుర్తింపు తీసుకునేందుకు ప్రయాణికులు సెల్ఫీ తీసుకోవాలి.