ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐ లవ్యూ అని చెప్పడం కామన్.. థింక్ డిఫరెంట్!

చేతిలో రోజా పువ్వో.. ఖరీదైన ఉంగరమో పట్టుకొని మోకాలిపై కూర్చొని 'ఐ లవ్యూ డార్లింగ్'​ అని చెప్పడం కామన్. దీనికి భిన్నంగా ఎలా ప్రపోజ్ చేయొచ్చు అంటే... ఇదిగో ఇలా!

ఐ లవ్యూ అని చెప్పడం కామన్.. సో థింక్ డిఫరెంట్
ఐ లవ్యూ అని చెప్పడం కామన్.. సో థింక్ డిఫరెంట్

By

Published : Feb 13, 2021, 12:23 PM IST

సరదాగా...

  • నాకు ఈ ప్రపోజ్ చేయడాలు.. పబ్ కి పిలవడాలు రావు. నువ్వు నాకు నచ్చావ్. నేనూ నీకు నచ్చితే నాతో ఏడడుగులు నడిచి నా నట్టింటికొచ్చేస్తావా? నిజాలు చెప్పి నిన్ను ఇంప్రెస్ చేసే సమయం లేదు. అబద్దాలు చెప్పి పడేయడానికి నువ్వు కాలీఫ్లవర్ కాదు. నువ్వు సమ్​థింగ్​... నేనూ సమ్ థింగ్. ఇద్దరం కలిసి చేసేద్దాం ఎవ్రీథింగ్​.
  • నన్నంతా మజ్నూలా ఉంటావంటారు. నీపేరేమైనా లైలానా?
  • ఏ, ఈ, ఓ, యూ.. వీటిలో మిస్ అయిన అచ్చు ఏంటి " ఐ'. మరి హేట్​కి వ్యతిరేక పదం. 'లవ్'. వీ పదానికి ముందొచ్చేది? యూ "........ఐ లవ్ యూ టూ
  • మా గోడపై పెద్ద ఫోటో ఉంది. అందులో అమ్మ, నాన్న,అక్క, తమ్ముడు, బామ్మ, తాతయ్య అందరూ ఉన్నారు. ఒక్క కోడలి స్థానమే ఖాళీగా ఉంది. నీ ఫొటో పెట్టేయనా?

ఇది వాక్సిన్ ప్రపోజల్..

రాబీ వర్షాస్ అమెరికాలోని సౌత్ డకోటాలో పారామెడికల్ స్టాప్. కరోనాపై పోరులో అలుపెరుగని కృషి చేశాడు. అందరిలాగే ఎప్పుడెప్పుడా అని వ్యాన్ కోసం ఎదురుచూశాడు. ఏడాది సుదీర్ఘ విరామం తర్వాత ఆ రోజు రానే వచ్చింది. డ్యూటీలో భాగంగా అందరికీ టీకా ఇస్తున్నాడు. ఆ వరుసలో తన మనసుకి నచ్చిన నర్స్. ఇదే మంచి తరుణం అనుకున్నాడు. తనకి వ్యాక్సిన్ వేస్తూనే వేలికి ఉంగరం తొడిగి 'జీవితాంతం నాకు తోడుంటావా అని ప్రపోజ్ చేశాడు. అవతలి వ్యక్తి కళ్లు చెమర్చాయి. కొద్ది క్షణాల తర్వాత 'ఓ ఎస్' అనే సమాధానం వచ్చింది. ఈ వీడియో ఆన్​లైన్​లో వైరల్ అయ్యింది. కొసమెరుపు ఏంటంటే.. రాబీ ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎరిక్ వాండర్లీ కూడా అబ్బాయే.

ఇవీ చూడండి:

పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 10.30 గంటలకు ఓటింగ్ శాతం

ABOUT THE AUTHOR

...view details