అసలే కరోనా కారణంగా సగం సీట్లతో నడుస్తున్న ఆర్టీసీ బస్సులపై పెరుగుతున్న డీజిల్ ధరలు మరింత భారం మోపుతున్నాయి. డీజిల్ ధరలు పెరగనంత వరకు ఆర్టీసీకి కి.మీపై రూ.13.40 ఖర్చయ్యేది. ఇటీవల డీజిల్ ధర రూ.9కిపైగా పెరిగింది. దీంతో ఆర్టీసీకి కి.మీ.కు రూ.15.20 వరకు వ్యయమవుతోంది. అంటే ప్రతి కి.మీ.కు రూ.1.80 అదనపు భారం పెరిగింది. ప్రస్తుతం పరిమితంగా 3వేల నుంచి 3,400 వరకు సర్వీసులను నడుపుతున్నారు. సగటున 11 లక్షల కి.మీ. మేర ఇవి ప్రయాణిస్తున్నాయి. దీంతో దాదాపు రూ.20లక్షల మేర ఆర్టీసీపై అదనపు భారం పడుతోంది. సాధారణ రోజుల్లో ఆర్టీసీ 11వేల సర్వీసులను 43 లక్షల కి.మీ.ల మేర నడుపుతుంది. ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరలను పరిగణనలోకి తీసుకుని, పూర్తి సర్వీసులు నడిపితే రోజుకు రూ.77.4లక్షల వరకు అదనపు భారం పడే అవకాశముంది. ఇది ఏడాదికి రూ.280కోట్ల వరకు ఉంటుంది.
డీజిల్ ధరలతో ఆర్టీసీకి భారం
ఆర్టీసీ బస్సులపై పెరుగుతున్న డీజిల్ ధరలు మరింత భారం మోపుతున్నాయి. ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరలను పరిగణనలోకి తీసుకుని, పూర్తి సర్వీసులు నడిపితే రోజుకు రూ.77.4లక్షల వరకు అదనపు భారం పడే అవకాశముంది.
డీజిల్ ధరలతో ఆర్టీసీకి భారం