ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

FAKE UNIVERSITIES: దేశంలో 24 నకిలీ యూనివర్సిటీలు - నకిలీ యూనివర్సిటీలు

దేశంలో నకిలీ యూనివర్సిటీలు చాలానే ఉన్నాయి. పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఈ విషయం వెల్లడించింది. 24 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని తెలిపింది.

fake universities
fake universities

By

Published : Aug 3, 2021, 6:55 PM IST

దేశవ్యాప్తంగా యూనియన్ గ్రాంట్స్ కమిషన్ 24 నకిలీ విశ్వవిద్యాలయాలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పార్లమెంట్ సమావేశాల్లో.. దేశంలో నకిలీ విశ్వవిద్యాలయాలకు సంబంధించి లోక్​సభలో పలువురు ఎంపీలు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.

ఎంపీల ప్రశ్నలకు సమాధానంగా కేంద్రం పార్లమెంట్​లో కీలక ప్రకటన చేసింది. లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 8నకిలీ యూనివర్సిటీలను గుర్తించినట్లు వెల్లడించారు.

ఇక యూజీసీ ఢిల్లీలో 7, ఒడిశాలో 2, పశ్చిమ బెంగాల్‌లో 2, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి‌లో ఒక్కో నకిలీ యూనివర్సిటీని గుర్తించినట్లు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు, మీడియా ఫిర్యాదుల ద్వారా ఫేక్ యూనివర్సిటీలను గుర్తించినట్లు లోక్‌సభలో కేంద్రం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details