అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని.. ఎటువంటి సమస్య తలెత్తకుండా చూస్తామని చెప్పారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే సమర్థంగా స్పందించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. పౌరులకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని... శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా పెట్టామని వెల్లడించారు. శాంతిభద్రతల విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు.
అయోధ్య టెన్షన్.. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల అటెన్షన్
అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో డీజీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శాంతిభద్రతల విషయంలో ఎస్పీలు, కింది స్థాయి సిబ్బంది వరకూ అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
dgp