మహిళలు, యువతులు, చిన్నారులకు అత్యంత రక్షణగా ఉండే రాష్ట్రంగా ఏపీని తయారు చేశామని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గుడ్ షెపర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఆశ్రమంలో ఉంటున్న హిమ బిందు అనే చిన్నారికి డీజీపీ నూతన వస్త్రాలు, ఆటబొమ్మలు ఇచ్చారు. మిగిలిన విద్యార్థులకు పుస్తకాలు, చాక్లెట్లను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
13వేల మందికి విముక్తి