పోలీసుశాఖ సాంకేతిక బృందాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘాకు సాంకేతిక పరిజ్ఞానం వాడామన్న డీజీపీ.. హోమ్ క్వారంటైన్ యాప్ ద్వారా జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో పర్యవేక్షిస్తున్నాం అని తెలిపారు. సుమారు 22 వేల మందిపై 28 రోజులపాటు నిఘా పెట్టామన్న డీజీపీ.. జియో ఫెన్సింగ్ నిబంధనలు ఉల్లంఘించిన 3,043 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. 28 రోజుల హోమ్ క్వారంటైన్ పూర్తయిన వారిపై ఆంక్షలు తొలగిస్తామని.. యాప్ ద్వారా తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువమందిపై నిఘా ఉంచామన్నారు. రెడ్‌జోన్ ప్రాంతాల వారిపై నిఘా కోసం మరో యాప్ సిద్ధం చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు.
రెడ్‌జోన్ ప్రాంతాలపై నిఘా కోసం మరో యాప్: డీజీపీ - ap corona cases latest news
విదేశాల నుంచి వచ్చినవారిపై సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా పెట్టామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. సుమారు 22 వేల మందిపై 28 రోజులపాటు నిఘా పెట్టామన్న డీజీపీ.. జియో ఫెన్సింగ్ నిబంధనలు ఉల్లంఘించిన 3,043 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.
dgp-gowtham-sawag