ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెమ్‌డెసివిర్, ఆక్సిజన్ నిల్వలు, ఫీజుల దందాపై నిరంతర నిఘా: డీజీపీ

రెమ్‌డెసివిర్, ఆక్సిజన్ నిల్వలు, ఫీజుల దందాపై నిరంతర నిఘా ఉంటుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆస్పత్రులు పరిమితికి మించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్సిజన్ వాహనాలకు రవాణా ఇబ్బందులు కలగకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

dgp gowtham savang
డీజీపీ గౌతమ్ సవాంగ్

By

Published : Apr 29, 2021, 7:25 PM IST

రెమ్‌డెసివిర్, ఆక్సిజన్ నిల్వలు, ఫీజుల దందాపై నిరంతర నిఘా ఉంటుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రెమ్‌డెసివిర్‌ను నల్లబజారులో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెమ్‌డెసివిర్, ఆక్సిజన్‌ అక్రమ తరలింపుపై 100, 1902 కు కాల్‌ చేయాలని డీజీపీ సూచించారు.

పరిమితికి మించితే కఠిన చర్యలు...

కొవిడ్ రోగుల నుంచి ఆస్పత్రులు వసూలు చేసే ఫీజులపై ఆరా తీసిన డీజీపీ.. పరిమితికి మించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్సిజన్ వాహనాలకు రవాణా ఇబ్బందులు కలగకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర, జిల్లాస్థాయి నోడల్ అధికారులను నియమించామని, కొవిడ్ కంట్రోల్ రూమ్‌లో ఇద్దరు ఐపీఎస్ అధికారులను నియమిస్తామని డీజీపీ సవాంగ్ అన్నారు.

మాస్కులు ధరించకుంటే జరిమానా...

కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని గౌతమ్ సవాంగ్ సూచించారు. మాస్కులు ధరించకుంటే జరిమానాలు తప్పవని, రాత్రిపూట కర్ఫ్యూ సమర్థవంతంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. కరోనాపై అబద్ధాలు, పుకార్లు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీచదవండి.

వ్యాక్సినేషన్ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియదు: జగన్

కరోనాను జయించిన మాజీ ప్రధాని మన్మోహన్

ABOUT THE AUTHOR

...view details