విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారు కచ్చితంగా తమ సమాచారాన్ని వైద్య, ఆరోగ్యశాఖకు ఇవ్వాలని డీజీపీ గౌతం సవాంగ్ కోరారు. లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా కోవిడ్-19 లక్షణాలు బయట పడుతున్నాయని... అందుకే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నట్టు చెప్పారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పూర్తిగా సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ సూచనల ప్రకారం విధిగా ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచడం, హోం ఐసోలేషన్ పాటించకపోవడం, సమాచారాన్ని దాచిపెట్టడం, వైద్య ఆరోగ్య శాఖ సూచనలు పాటించకపోవడం చట్టరీత్యా నేరమని వివరించారు. అలాంటి వారిపై కఠిన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.
కర్ఫ్యూ పొడిగింపుపై అభ్యర్థనలు...