ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశంసిస్తూ... రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి చేసిన టిక్ టాక్ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. 'రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న'... అనే పాటకు ఆమె టిక్ టాక్ చేశారు. రాష్ట్ర ఎన్నికల వేళ ప్రచారంలో భాగంగా వైకాపా.. ఈ పాటను విడుదల చేసింది. ఆ పార్టీకి అత్యంత మైలేజ్‌ను తెచ్చిపెట్టిన పాటల్లో ఈ పాట ఒకటి. ముఖ్యంగా రాయలసీమ వాసులను ఈ లిరిక్స్ బాగా ఆకట్టుకున్నాయి. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పుష్పశ్రీవాణి... జగన్ కేబినెట్లో మంత్రిగా ఛాన్స్ కొట్టేయడమే గాక... డిప్యూటీ సీఎం పదవి కూడా వరించింది. ఈ పాటకు టిక్ టాక్ చేయడంతో జగన్ పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకుంది మన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. అయితే ఉపముఖ్యమంత్రి టిక్‌టాక్ పై పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న.. డిప్యూటీ సీఎం టిక్ టాక్ - deputy cm pamula pushpa srivani tiktock news
సీఎం జగన్‌పై ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి చేసిన టిక్ టాక్ వీడియో నెట్టింట వైరలయ్యింది. వైకాపా ఎన్నికల ప్రచారంలో భాగంగా విడుదల చేసిన 'రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న..' అంటూ సాగే పాటను ఆమె టిక్ టాక్ చేశారు. ఈ పాటకు రాయలసీమలో మంచి క్రేజ్ వచ్చింది.
deputy cm pamula pushpa srivani tiktock on ys jagan song