రాష్ట్రవ్యాప్తంగా దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో... నవరాత్రుల సందడి ఇలకైలాసాన్ని తలపిస్తోంది. మహానందిలో శ్రీ కామేశ్వరి దేవికి భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. నంద్యాలలో అమ్మవారి ఆలయాల్లో... దసరా శోభ సంతరించుకుంది. అదోనిలో వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో... ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఎమ్మిగనూరులో శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో... అమ్మవారు శ్రీఅన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడ, అనంతపురం, కడప జిల్లాల్లోనూ... ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ప్రకాశం జిల్లావ్యాప్తంగా... అమ్మవారి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని బ్రమరాంభ, మల్లిఖార్జున స్వామి ఆలయానికి.... భక్తులు పోటెత్తారు. అమ్మవారి మూలవిరాట్టును భక్తులు రోజుకో రూపంలో అలంకరిస్తున్నారు.
విజయనగరం జిల్లా సాలూరు శ్రీ పంచముఖేశ్వర ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి తెప్పోత్సవం ,అంజలి సేవ పవళింపు సేవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహిళలు పెద్దసంఖ్యలో కలశాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు.కాలికాదేవి వేషధారణలు, డప్పు, గరగ నృత్యాలు ఆకట్టుకున్నాయి.