గిఫ్ట్ కార్డుల పేరుతో మోసాలు చేస్తున్న ముఠాను.. తెలంగాణ రాష్ట్రం సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. 10 మందిని అరెస్టు చేశారు. గిఫ్ట్ కార్డుల మోసం కేసులో బిహార్, ఝార్ఖండ్‌కు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకోగా.. మంచిర్యాలకు చెందిన మరో ఐదుగురిని పట్టుకున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసులో కమలేశ్ దూబే ప్రధాన నిందితుడని వెల్లడించారు.
నిందితుల నుంచి 42 సెల్‌ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, 900 స్క్రాచ్ కార్డులు, 28 డెబిట్ కార్డులు, 10 ఆధార్ కార్డులు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు న్యాప్‌టాల్, షాప్‌క్లూస్ నుంచి వినియోగదారుల డేటా సేకరించారని వెల్లడించారు.