పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు గవర్నర్ ఆమోదించడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఖండించారు. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రాజధాని రైతులు, ప్రజలు అందరూ వ్యతిరేకించినా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా గవర్నర్ రెండు బిల్లులను ఆమోదించడం గర్హనీయమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా పరిపాలన రాజధానిని తరలించే ఆలోచనను విరమించుకోవాలని కోరారు.
ఆ బిల్లులకు ఆమోదం తెలపటం గర్హనీయం: మధు
రాజధానికి సంబంధించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపటం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రైతులు, మహిళలు, ప్రజాసంఘాలు అందరూ వ్యతిరేకించినా ఆమోదం తెలపటం గర్హనీయమన్నారు.
cpm madhu