రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని... శాసన మండలిలో మంత్రులే రౌడీల్లా ఎమ్మెల్సీలపై దాడికి ప్రయత్నించడం... జగన్ ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాజధానిగా అమరావతే కొనసాగాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జేఏసీ పోరాడుతోందని తెలిపారు. రాష్ట్రంలో 84 శాతం మంది ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని అన్నారు.
'ఇలా చేయడం జగన్ ప్రభుత్వ దిగజారుడుతనమే'
శాసన మండలిలో ఎమ్మెల్సీలపై దాడిని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ఇలా చేయడం వైకాపా ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు.
మండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నందుకు... మండలినే రద్దు చేయాలని తీర్మానం చేయడం సబబు కాదని హితవు పలికారు. ప్రశ్నించడం నచ్చని ప్రభుత్వం... అందరిపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. రాజధాని కోసం పోరాడుతున్నవారిపై కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. పోలీసులతో ప్రజాభిప్రాయాన్ని అణచివేసే విధంగా ప్రవర్తిస్తున్నారని... ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.
ఇదీ చదవండి:ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదు: రఘురామకృష్ణరాజు