కేంద్ర ప్రభుత్వ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పిన కేంద్రమంత్రులు.. ఇప్పుడేమో పుదుచ్చేరికి హోదా ఇస్తామంటున్నారని విమర్శించారు. ఏపీకి హోదా సాధనపై రాష్ట్ర భాజపా నేతల వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికొచ్చే కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా భాజపాను నిలదీయాలని సూచించారు.
హోదా ఇవ్వనన్నారు.. పుదుచ్చేరికి ఎలా ఇస్తామంటున్నారు..? - ఏపీకి ప్రత్యేక హోదా
ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వబోమని చెప్పిన కేంద్ర మంత్రులు.. పుదుచ్చేరికి ఎలా ఇస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఏపీకి హోదా సాధనపై రాష్ట్ర భాజపా నేతల వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ రామకృష్ణ