ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి: రామకృష్ణ

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు.

cpi ramakrishna comments on CAA
cpi ramakrishna comments on CAA

By

Published : Mar 3, 2020, 12:47 PM IST

Updated : Mar 3, 2020, 4:41 PM IST

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ

సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఏఏ, ఎన్​ఆర్సీకి వ్యతిరేకంగా కడప, అనంతపురం జిల్లాల్లో బహిరంగ సభలు తలపెట్టామని వెల్లడించారు. మార్చి 7న కడపలో నిర్వహించే బహిరంగ సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా హాజరవుతారని... అనంతపురం సభలో కేరళ సీఎం విజయన్ పాల్గొంటారని చెప్పారు. సీఏఏ, ఎన్​ఆర్సీకి వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే ముస్తఫా రాజీనామాు చేయాల్సిన అవసరం లేదని.. తమతో కలిసి పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

'ప్రధానికి లేఖ రాయాలి'

బీసీ రిజర్వేషన్లపై సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయాలన్నారు రామకృష్ణ. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించకుండా ప్రధానికి లేఖ రాయాలని కోరారు.

ఇదీ చదవండి:

నడిసంద్రంలో మృత్యువుతో పోరాటం

Last Updated : Mar 3, 2020, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details