అమరావతి ఉద్యమం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఏడాదైనా అమరావతి రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదని.. ఇప్పటికైనా సీఎం జగన్ పునరాలోచించాలని సూచించారు. రాయపూడి జనభేరి కార్యక్రమంలో రామకృష్ణ పాల్గొన్నారు. రాజధాని మార్పుపై జగన్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని మార్పు విషయంపై వైకాపా మేనిఫెస్టోలో ఎక్కడా లేదని రామకృష్ణ ధ్వజమెత్తారు. గంటల వ్యవధిలోనే మూడు రాజధానుల బిల్లును ఆమోదించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'అమరావతి పోరాటంలో విజయం రైతులదే'
అమరావతి పోరాటంలో అంతిమ విజయం రైతులదే అని సీపీఐ రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమాన్ని అణిచివేసేందుకు రైతులపై అక్రమంగా కేసులు పెట్టారని దుయ్యబట్టారని... ఇప్పటికైనా సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
రాయపూడి జనభేరి కార్యక్రమంలో రామకృష్ణ
అమరావతి ఉద్యమంలో రాజధాని మహిళలు పట్టువదలట్లేదని.. ఈ పోరాటంలో అంతిమ విజయం రైతులదేనని రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఐకాస నేతలు అందరినీ కలుపుకొని వెళ్తున్నారని.. కాంగ్రెస్, భాజపా, వామపక్షాలను ఒకే వేదికపైకి తెచ్చిన ఘనత అమరావతి ఉద్యమానిదేనని రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.