కొవిడ్ మృతుల ఎక్స్‌గ్రేషియా విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో మరణించిన వారికి ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వటానికి ఇబ్బందేంటని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే... దివాలా తీసినట్లుగా కేంద్రం సమాధానం చెప్పటం సమంజసం కాదని మండిపడ్డారు. దాదాపు నాలుగు లక్షల మంది వైరస్ కారణంగా మృతి చెందారని ఆయన వెల్లడించారు. వారందరికీ సుమారు 14 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కేంద్ర ప్రభుత్వం వెనకాడుతుండటం సరైన చర్య కాదన్నారు.
'కొవిడ్ మృతుల ఎక్స్‌గ్రేషియా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదు' - CPI National Secretary Narayana critics on central government news
కొవిడ్ మృతుల ఎక్స్‌గ్రేషియా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరైంది కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పిన తీరుని ఆయన తప్పు పట్టారు.
కొవిడ్ వ్యాప్తితో దేశం అతలాకుతలం అవుతున్న సమయంలోనే కార్పొరేట్ కంపెనీలకు రూ.18లక్షల కోట్లు దారాదత్తం చేసినప్పుడు.. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవనే సంగతి గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. పీఎం కేర్ ఫండ్‌కి వచ్చిన డబ్బంతా ఏం చేశారన్నారు. విపత్తు నుంచి మానవ వనరులను కాపాడుకోలేకపోతే.. దేశాభివృద్ధి నిలిచిపోతుందని పేర్కొన్నారు. కేంద్రానికి ప్రజలు కావాలో.. కార్పొరేట్ సంస్థలు కావాలో తేల్చుకోవాలన్నారు.
ఇదీ చదవండి:CM Jagan: కొవిడ్ వ్యాప్తిపై మరింత అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్