కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను మోసం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చర్చల పేరుతో రైతులను నమ్మించేందుకు చూస్తున్నారని అన్నారు. కేంద్రం ప్రయత్నాలను నమ్మి వెనక్కి తగ్గితే.. భవిష్యత్తులో బానిసలుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ను లెక్క చేయకుండా ఎముకలు కొరికే చలిలో రైతులు ఆందోళనలు చేస్తున్నా... ప్రధాని మోదీ మనసు కరగటం లేదన్నారు. వారితో పాటు ఒక్క రోజు అయినా మోదీ ఉండగలరా..? అని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై తక్షణమే స్పందించి... డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
రైతుల ఆందోళనలపై కేంద్రం తక్షణమే స్పందించాలి: నారాయణ - దిల్లీలో రైతుల ఆందోళన వార్తలు
దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. చర్చల పేరుతో రైతులను మోసం చేసే ప్రయత్నాలను ఆపాలని అన్నారు.
cpi-narayana