తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆస్తుల విక్రయ వ్యవహారంలో ప్రభుత్వం.. తమ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవటం మంచి పరిణామమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ అన్నారు. భక్తులు దేవస్థానానికి అందజేసిన విరాళాలు, ఆస్తులను ఆధ్యాత్మిక, సామాజికపరమైన కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని సూచించారు. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, వసతి గృహాలు వంటి వాటిని నిర్మించేందుకు ఉపయోగించుకోవాలన్నారు. మెుదటిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఓ నిర్ణయం వెనక్కి తీసుకోవడం ఏడాది పరిపాలన కాలంలో ఇదే తొలిసారన్నారు. తెలిసో తెలియకో చేసిన పొరపాట్లను సవరించుకోవడం మంచిదేనని అన్నారు. అమరావతి రాజధాని విషయంలోనూ తొందరపాటుగా తీసుకున్న నిర్ణయం తప్పు అని అన్న ఆయన... దీన్ని కూడా సవరించాలని కోరారు.
ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం: సీపీఐ నేత నారాయణ
తితిదే ఆస్తుల విక్రయ ప్రతిపాదనపై ప్రభుత్వం వెనక్కి తగ్గటంపై సీపీఐ నేత నారాయణ హర్షం వ్యక్తం చేశారు. తితిదే భూములను అమ్మకుండా, వాటిని సేవలకు ఉపయోగించాలని సూచించారు.
తితిదే స్థల విక్రయాలంపై స్పందించిన సీపీఐ నారాయణ