ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికలు జరిపించడం అసాధ్యం కాదు: నారాయణ

మంచి వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్​ను కోరారు. ఎన్నికలు జరిపించడం అసాధ్యం కాదని పేర్కొన్నారు.

cpi narayana commebts on local bodies election in andhra pradesh
cpi narayana commebts on local bodies election in andhra pradesh

By

Published : Dec 25, 2020, 1:24 PM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించడం అసాధ్యం కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని నారాయణ అన్నారు.. బిహార్లో అసెంబ్లీ, హైదరాబాద్​లో మున్సిపల్​ కార్పొరేషన్ల ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రతినిధులతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ చర్చించి.. మంచి వాతావరణంలో ఎన్నికల నిర్వహణ చేపట్టాలని కోరారు.

స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్​కు సహకరించడం ప్రభుత్వ బాధ్యత అని నారాయణ అన్నారు. సామరస్యంగా ఇరు వర్గాలు సమస్యను పరిష్కరించుకుని.. ఎన్నికలు జరిగేలా చూసి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని నారాయణ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: 'చిన్న బాధ ఉంది'... సీఎం జగన్ భావోద్వేగం

ABOUT THE AUTHOR

...view details