ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజులోనే 1,213 మందికి వైరస్​ - తెలంగాణలో కరోనా కేసులు

కరోనా పంజాకు తెలంగాణ రాష్ట్రం విలవిల్లాడుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. గురువారం ఏకంగా 1,213 మంది వైరస్‌ బారిన పడ్డారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే 1,100 కేసులు నమోదు కావడం.... కొవిడ్‌ కల్లోలానికి అద్దంపడుతోంది. మహమ్మారికి మరో ఎనిమిది బలికాగా... మొత్తం మృతుల సంఖ్య 275కి చేరింది.

covid-update-1213-new-corona-positive-cases-registered-in-telangana-on-thursday
తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

By

Published : Jul 3, 2020, 7:32 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఊహకందని రీతిలో విజృంభిస్తోంది. గురువారం రికార్డుస్థాయిలో 1,213 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో పోరాడుతూ ఎనిమిది మంది కన్నుమూశారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 18,570కి చేరింది. గురువారం వచ్చిన వాటిలో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో 998 కేసులు వెలుగుచూశాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తున్న వైరస్‌ భూతం... తీవ్ర కలకలం రేపుతోంది. మేడ్చల్‌లో 54, రంగారెడ్డిలో 48 కేసులు రావడం మహమ్మారి విజృంభణకు అద్దంపడుతోంది.

జిల్లాల్లో పెరుగుతున్న కేసుల సంఖ్య

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో కరోనా కమ్మేస్తుంది. గురువారం ఖమ్మం 18, వరంగల్‌ గ్రామీణం 10, వరంగల్‌ అర్బన్‌ 9, నల్గొండ 8, భద్రాద్రి కొత్తగూడెం 7, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఏడు చొప్పున కేసులు నిర్ధరణ అయ్యాయి. కరీంనగర్‌, మహబూబాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలో ఐదేసి మంది వైరస్‌ బారిన పడ్డారు. సూర్యాపేట, ములుగు, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాలో నాలుగు చొప్పున కొవిడ్‌ కేసులు నిర్ధరణ అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 2 కేసులు రాగా... గద్వాల, సిద్దిపేట , మెదక్‌ , యాదాద్రి , నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లా ఒక్కొక్కరు కరోనా బారిన పడ్డారు.

ఆందోళన కలింగించే విషయం ఏమిటంటే

తెలంగాణ రాష్ట్రంలో గురువారం నిర్వహించిన 5,356 పరీక్షల్లోనే... 1,213 కేసులు నమోదు కావడం వైరస్‌ విలయానికి నిదర్శనంగా నిలుస్తోంది. మొత్తం ఇప్పటివరకూ 98,153 టెస్టులు నిర్వహించారు. గురువారం 987 మంది డిశ్చార్చికాగా... తెలంగాణలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 9,069కి చేరుకుంది. మహమ్మారికి మరో 8 మంది బలికాగా... మొత్తం మృతుల సంఖ్య 275కి చేరినట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.

హైదరాబాద్ నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వృద్ధురాలు కొవిడ్‌తో కన్నుమూసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పురపాలిక పరిధిలో మూడు కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందడం... స్థానికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మహబూబాబాద్‌లోని ప్రముఖ పిల్లల దవాఖానాల్లో పనిచేస్తున్న నర్సుకు కరోనా సోకింది. గూడూరు మండలంలోని ఓ గ్రామంలో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఓ గ్రామంలో ప్రజలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. పాలవ్యాపారం నిర్వహించే దంపతులకు కొవిడ్‌ సోకడంతో అప్రమత్తమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details