రాష్ట్రంలో కొత్తగా 761 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2,67,665కు, మృతుల సంఖ్య 1,448కు చేరింది. కొత్తగా 702 మందికి నయం కాగా... 2,55,378మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 10,839 మంది చికిత్స పొందుతుండగా... అందులో 8,651 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల శాతం కేవలం 0.54గా ఉండగా రికవరీలు మాత్రం 95.40శాతంగా ఉండటం గమనార్హం.
తెలంగాణలో కొత్తగా 761 కేసులు నమోదు..నలుగురు మృతి
రాష్ట్రంలో కొత్తగా నమోదైన 761కేసులతో కలిపి... బాధితుల సంఖ్య 2,67,665కు చేరింది. మరో నలుగురు మృతి చెందగా... ఇప్పటివరకు వైరస్‌తో 1,448 మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 10,839 మంది చికిత్స పొందుతున్నారు.
తాజాగా వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల్లో ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 33, జీహెచ్ఎంసీ 136, జగిత్యాల 21, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 9, జోగులాంబ గద్వాల 7, కామారెడ్డి 12, కరీంనగర్ 32, ఖమ్మం 28, కుమురం భీం ఆసిఫాబాద్ 1, మహబూబ్‌నగర్ 10, మహబూబాబాద్ 17, మంచిర్యాల 29, మెదక్ 14, మేడ్చల్ మల్కాజిగిరి 69, ములుగు 18, నాగర్‌కర్నూల్ 9, నల్గొండ 28, నారాయణపేట 4, నిర్మల్ 2, నిజామాబాద్ 19, పెద్దపల్లి 18, రాజన్న సిరిసిల్ల 28, రంగారెడ్డి 55, సంగారెడ్డి 18, సిద్దిపేట 30, సూర్యాపేట 33, వికారాబాద్ 11, వనపర్తి 5, వరంగల్ రూరల్ 17, వరంగల్ అర్బన్ 24, యాదాద్రి భువనగిరిలో 18 చొప్పున కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:ఏపీలో ఎడతెగని వర్షం.. ఈదురుగాలుల బీభత్సం..