తెలంగాణలోని మంచిర్యాల జిల్లా విద్యాశాఖకు కరోనా భయం పట్టుకుంది. జిల్లా కేంద్రంలోని గర్శిల్ల ఉన్నత పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు... హాజీపూర్ మండలంలోని ముల్కల్ల ఉన్నత పాఠశాలకు చెందిన మరో ఉపాధ్యాయునికి కొవిడ్ పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది.
కొవిడ్ బారిన పడిన ఉపాధ్యాయులు పరీక్షలు చేయించుకునే మూడు రోజుల ముందు వరకు పాఠశాలలకు వచ్చేవారని... విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులతో కలిసే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు మిగితా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించలేదు. బడిలో కొవిడ్ కేసులు పెరుగుతున్నా.. జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.